కరీంనగర్‌లో రోడ్డుపై జనాలను హడలెత్తిస్తున్న ఎలుగుబంటి
- అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి
- నిన్న రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో తిరుగుతూ హల్ చల్
- భయాందోళనలకు గురవుతున్న స్థానిక ప్రజలు
అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి కరీంనగర్ పట్టణంలో ప్రజలను హడలెత్తించింది.ఈ రోజు ఉదయం రేకుర్తి బస్టాప్ సమీపంలో కరీంనగర్-జగిత్యాల రహదారిపై ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఒక్కసారిగా రోడ్డుపైన ఎలుగుబంటిని చూసిన జనాలు భయాందోళనలకు గురయ్యారు. దాని దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. శుక్రవారం రాత్రి నుంచి ఎలుగుబంటి పట్టణంలోకి వచ్చి అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు.
నిన్న రాత్రి నగర శివారులోని రజ్వి చమన్ ప్రాంతంలో సంచరిస్తూ తెల్లవారుజాము వరకు ఆ పరిసర ప్రాంతాల్లో హల్ చల్ చేసింది. ఈ రోజు ఉదయం రేకూర్తిలో ఇళ్ల మధ్యకు వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎలుగుని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.