బీచ్ లో ఊహించని ప్రమాదం.. పావు నిమిషం లేట్ అయినా ప్రాణాలు పోయేవే!

బీచ్ లో ఊహించని ప్రమాదం.. పావు నిమిషం లేట్ అయినా ప్రాణాలు పోయేవే!
  • బ్రిటన్ లోని డోర్సట్ తీరంలో ప్రమాదం
  • ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు
  • వేగంగా పరుగులు తీయడంతో తప్పిపోయిన ప్రాణ ప్రమాదం
పర్యాటక ప్రదేశాలకు వెళ్లిన సమయంలో ఎంజాయ్ మెంట్ ఒక్కటే కాకుండా కాస్త అటూ ఇటూ చూసుకుంటూ ఉండాలి. ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇది లేకపోవడం వల్లే ఎంతో మంది ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కొండచరియలు పెద్ద ఎత్తున విరిగి పడడం, భారీ వర్షాలకు వరదలతో ఇళ్లు నేలమట్టం కావడం తెలిసిందే. ఇలాంటిదే ఓ ఘటన బీచ్ ఒడ్డున జరిగింది.

బ్రిటన్ లోని డోర్సెట్ వెస్ట్ అనే తీర ప్రాంత పర్యాటక ప్రదేశంలో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు పర్యాటకలు బీచ్ ఒడ్డున నడుస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఎత్తయిన కొండ నుంచి ఓ భాగం (కొండ చరియ) ఒక్కసారిగా విరిగి పడిపోయింది. అదే సమయంలో కొండ దిగువన తీరంలో ఇసుకపై నడుస్తున్న ముగ్గురు పర్యాటకులు ప్రమాదాన్ని గుర్తించి వేగంగా పరిగెట్టారు. మొత్తానికి వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఒకరు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. కొండ ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లే నమయంలో అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రమాదాలను నివారించుకోవచ్చు.


More Telugu News