వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభ బరిలోకి కవిత
- ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పిన కవిత
- ప్రభుత్వం అభివృద్ధిలో బిజీగా ఉంటే బీజేపీ నేతలు దుష్ప్రచారంలో బీజీగా ఉన్నారని ఎద్దేవా
- నిరంతర విద్యుత్‌పై బండి సంజయ్‌కు సవాల్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్నారు. ఊహాగానాలకు తెరదించుతూ ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ అసెంబ్లీ, లోక్‌సభ దేనికి పోటీ పడినా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారానికి, దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
నిజామాబాద్ ఐటీ హబ్ గురించి ఎంపీ అర్వింద్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం తప్పుడు వార్తల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాను హేళన చేస్తున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన కార్యాలయంలోని స్విచ్‌బోర్డులో ఏ సమయంలోనైనా వేలు పెట్టాలని సవాలు చేశారు. డిపాజిట్ కోల్పోతారన్న భయంతో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి అర్వింద్ పోటీ చేయకపోవచ్చని, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని కవిత పేర్కొన్నారు.