కరీబియన్ లీగ్‌లో అంబటి రాయుడు.. సెయింట్ కిట్స్‌తో ఒప్పందం
- కరీబియన్ లీగ్‌లో ఆడబోతున్న రెండో ఇండియన్‌గా రికార్డుల్లోకి
- యూఎస్ మేజర్ లీగ్‌లో ఒప్పందం కుదుర్చుకున్నా బీసీసీఐ కారణంగా బయటకు
- రిటైరైన క్రికెటర్లు ఏడాదిపాటు లీగులకు దూరంగా ఉండేలా కూలింగ్ ఆఫ్ పిరియడ్‌ను తీసుకొస్తున్న బీసీసీఐ
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో బ్యాట్ ఝళిపించనున్నాడు. ఈ మేరకు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫలితంగా లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తంబే తర్వాత ఈ లీగ్‌లో పాల్గొంటున్న రెండో ఇండియన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కబోతున్నాడు. మరో ఇద్దరు ఇండియన్లు.. సన్నీ సోహల్, స్మిత్ పాటిల్ సీపీఎల్‌లో ఆడినప్పటికీ వారు యూఎస్ఏ ప్లేయర్లుగా క్వాలిఫై అయ్యారు.
ఇటీవల ఐపీఎల్‌కు టాటా చెప్పేసిన రాయుడు అమెరికాలో నిర్వహించిన మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్‌సీ)లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, టీమిండియా క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే విదేశీ లీగుల్లో ఆడకుండా ఉండేందుకు ఓ విధానాన్ని తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. అంటే రిటైర్మెంట్ తర్వాత ఏడాది పాటు విదేశీ ఫ్రాంచైజీలకు దూరంగా ఉండేలా కూలింగ్ ఆఫ్ పిరియడ్ (తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేందుకు) తీసుకురావాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఎంఎల్‌సీ ప్రారంభానికి ఐదు రోజుల ముందు రాయుడు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.