ఇన్‌స్టాగ్రామ్‌లోనూ కోహ్లీకి డబ్బే డబ్బు.. ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు
- ఇన్‌స్టాలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన ‘హోపర్ హెచ్‌క్యూ’
- టాప్ ప్లేస్‌లో సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో
- ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్ల వసూలు
- టాప్-100 జాబితాలో కోహ్లీ, ప్రియాంక చోప్రాకు మాత్రమే చోటు
టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కోహ్లీకి సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగే ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 25.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న కోహ్లీ ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు వసూలు చేస్తున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు అత్యధికంగా డబ్బులు సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను ‘హోపర్ హెచ్‌క్యూ’ విడుదల చేసింది. ఈ జాబితాలో పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇన్‌స్టాలో అతడికి 59.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అర్జెంటినా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ రూ. 21.49 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 47.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మొత్తం 100 మంది సెలబ్రిటీల జాబితాను హోపర్ హెచ్‌క్యూ విడుదల చేయగా అందులో ఇద్దరు ఇండియన్లకు మాత్రమే చోటు దక్కింది. వారిలో ఒకరు విరాట్ కోహ్లీ కాగా, మరొకరు బాలీవుడ్/టాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. 2021లో 23వ స్థానంలో ఉన్న కోహ్లీ ఈసారి 14వ స్థానానికి ఎగబాకగా, ప్రియాంక చోప్రా ఒక్కో పోస్టుకు రూ. 4.40 కోట్లతో 29వ స్థానంలో చోటు దక్కించుకుంది.