మహిళా కానిస్టేబుల్ పై దాడిచేస్తే గన్ ఎక్కడికి వెళ్లింది?: నారా లోకేశ్
- 181 రోజులు పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర
- చంద్రబాబుపై దాడికి తాడేపల్లి ప్యాలస్ నుంచే కుట్ర జరిగిందన్న లోకేశ్
- జగన్ సైకో.. గుంటూరు జిల్లా వైసీపీ నేతలు పిల్ల సైకోలు
జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర పెదకూరపాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 181వ రోజు లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. క్రోసూరులో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. అడుగడుగునా మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ ఆత్మీయస్వాగతం పలికారు. భారీ గజమాలలతో యువ నేతను గ్రామాల్లోకి ఆహ్వానించారు. క్రోసూరు ప్రధాన రహదారి జనంతో కిటకిటలాడింది. యువనేతను చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చి, సమస్యలను విన్నవించారు. జగన్ అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి, తమపై జగన్ పెను భారం మోపాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానన్న జగన్ ఇప్పుడు రకరకాల పేరుతో ప్రజలను దోచుకుంటున్నాడని మండిపడ్డారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచే చంద్రబాబుపై దాడికి కుట్ర జరిగిందని లోకేశ్ విమర్శించారు. జగన్ డైరక్షన్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీఐజీ అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్కెచ్ వేశారని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే బాబాయిని చంపినోడిని లోపలేయండని సవాల్ విసిరారు. జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటామని... కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అనంతపురంలో మహిళా కానిస్టేబుల్ పై దాడి చేస్తే గన్ ఎక్కడకి వెళ్లిందని జగన్ ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. అమ్మలాంటి అమరావతిని చంపేసిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు. క్రోసూరు బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పెదకూరపాడులో జగన్ మాట్లాడుతూ... నాలుగేళ్లలో జగన్ పీకింది, పొడిచింది ఏమి లేదని అన్నారు. అందుకే బాబు గారు ప్రాజెక్టులు చూడటానికి వెళ్తే జగన్ భయపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఏ పర్యటనకు వెళ్లినా మొరగని వైసీపీ కుక్క లేదని అన్నారు. బాబు గారిపై దాడికి తాడేపల్లి ప్యాలస్ లోనే కుట్ర జరిగిందని అన్నారు. చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టారంటే జగన్ ఎంత పిరికోడో అర్దం అవుతోందని చెప్పారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ రెడ్డికి వైసీపీ వాళ్లు వేసిన రాళ్లు కనపడలేదని మండిపడ్డారు. వైసీపీ రౌడీల మీద ఒక్క కేసు లేదని... వారిద్దరూ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నారని విమర్శించారు.
జగన్ సైకో అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలు పిల్ల సైకోలు అని లోకేశ్ అన్నారు. ఎన్నికలకు ముందు అమరావతి లోనే రాజధాని అన్నాడని విమర్శించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన అమరావతిని జగన్ విధ్వంసం చేశాడని మండిపడ్డారు.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2420 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 9.5 కి.మీ.
*182వ రోజు (12-8-2023) యువగళం వివరాలు*
పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)
ఉదయం
8.00 – గార్లపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.45 – గార్లపాడులో స్థానికులతో సమావేశం.
10.45 – లగడపాడులో స్థానికులతో సమావేశం.
12.15 – పెదకూరపాడులో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
1.15 – పెదకూరపాడులో భోజన విరామం.
సాయంత్రం
4.00 – పెదకూరపాడు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – పెదకూరపాడు జంక్షన్ లో రైతులతో సమావేశం.
4.20 – పెదకూరపాడు-గుంటూరు రోడ్డులో ముస్లింలతో భేటీ.
5.05 – లింగంగుంట్లలో స్థానికులతో మాటామంతీ.
5.50 – పొడపాడులో వైకాపా బాధితులతో సమావేశం.
6.35 – పాదయాత్ర తాడికొండ అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం.
7.35 – సిరిపురం శివారు విడిది కేంద్రంలో బస.