విపక్షాల I.N.D.I.A. పేరుపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

  • INDIA పేరును ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ పిటిషన్
  • అసలు మీరెవరు? మీ ఆసక్తి ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్న
  • పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలన్న సుప్రీంకోర్టు
26 రాజకీయ పార్టీలు తమ కూటమికి I.N.D.I.A. (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్) అని పేరు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. I.N.D.I.A. అనే పేరును విపక్షాల కూటమి ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ లాల్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. 

అసలు మీరెవరు? మీ ఆసక్తి ఏమిటి? ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించండి... మీకు పబ్లిసిటీ కావాలి.. ప్రచారం మొత్తం కావాలి.. అంతేనా? అంటూ పిటిషనర్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజకీయాల్లో నైతికతను నిర్ణయించడం లేదని, ఈ పిటిషన్ ప్రజల సమయాన్ని వృథా చేయడమేనని పేర్కొంది. కేసును ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఆదేశించింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు కొట్టి వేసింది.


More Telugu News