జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు
- జగదాంబ సెంటర్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అభియోగాలు
- పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన అలా వ్యవహరించకూడదని స్పష్టీకరణ
- బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని సూచన
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం జగదాంబ సెంటర్‌లో జరిగిన సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ మూర్తి... జనసేనానికి నోటీసులు జారీ చేశారు. నిన్నటి బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన అలా వ్యవహరించి ఉండకూడదని, బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విద్వేష వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సభలో వాలంటీర్లు, ఆంధ్రా యూనివర్సిటీపై ఆరోపణలు చేసిన జనసేనానికి సెక్షన్ 30 కింద నోటీసులు జారీ అయ్యాయి.