జగన్‌ను ప్రశ్నిస్తున్నారు కానీ చంద్రబాబు ఏం చేశారు?: మంత్రి సీదిరి అప్పలరాజు
- చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్న మంత్రి
- తన హయాంలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించిన సీదిరి
- వైఎస్ సీఎం అయ్యాక వంశధార పట్టాలెక్కిందని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని జగన్‌ను ప్రశ్నిస్తున్నారని, కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... వంశధార ప్రాజెక్టు గురించి అడగడం విడ్డూరమన్నారు. చంద్రబాబు రెండుమూడుసార్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏం చేయలేదని, కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వంశధార పట్టాలెక్కిందన్నారు.
ప్రాజెక్టులపై ఒడిశాతో ఉన్న సమస్యలపై ఏనాడైనా స్పందించారా? అని బాబును నిలదీశారు. ప్రాజెక్టులపై సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, కానీ చంద్రబాబు కనీసం నిర్వాసితులకు న్యాయం చేయలేదన్నారు. వంశధారపై చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా, వైఎస్ ప్రారంభించారు, జగన్ పూర్తి చేస్తున్నారనేదే నిజమన్నారు. టీడీపీ హయాంలో శ్రీకాకుళం జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు.