ఈ టీ కప్పు విలువ రూ.24 కోట్లు..!
- ప్రపంచంలో అత్యంత విలువైన కప్పు ఇదే
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు
- 1,658 వజ్రాలు, బంగారంతో తయారీ
ప్రపంచంలో అతి ఖరీదైన టీ కప్పు గురించి విన్నారా..? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ కప్పు ఖరీదు రూ.24 కోట్లు. దీని యజమాని ఎన్.సేతియా ఫౌండేషన్. ప్రపంచంలో అత్యంత విలువైన టీ కప్పుగా ఇది రికార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా మన దగ్గర స్టెయిన్ లెస్ స్టీల్ టీ కప్పు వాడుతుంటాం. కానీ, సంపన్నుల అభిరుచులు వేరు. పూర్వ కాలంలో రాజులు కూడా సాధారణ టీ కప్పుల్లో తాగే వారు కాదు. వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన విలువైన కప్పులు ఉండేవి.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టీ కప్పుకు సైతం వజ్రాలు అద్దారు. అందుకే దీని వెల అంత భారీగా ఉంది. దీని పేరు ఇగోయిస్ట్. ఎన్ సేతియా ఫౌండేషన్, న్యూబీ టీస్ ఆఫ్ లండన్ సహకారంతో రూపొందించారు. ఇటాలియన్ జ్యుయలర్ ఫుల్వియో స్కావియా దీన్ని తయారు చేశారు. దీని ధర 30 లక్షల డాలర్లు. 2016లో ప్రపంచ రికార్డు అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు దీన్ని గుర్తించారు. 18 క్యారెట్ల బంగారం, 1658 వజ్రాలు, 386 థాయ్, బర్మీస్ రూబీలను దీని కోసం ఉపయోగించారు. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్ పేజీలో ఈ నెల 9న పోస్ట్ చేయడం గమనార్హం.