క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న 'క్వాల్ కామ్' ఇంజనీర్.. అది విని అవాక్కయిన మహిళ

  • కార్పొరేట్ జాబ్ కంటే క్యాబ్ తోనే ఎక్కువ ఆదాయం
  • ట్విట్టర్ లో ఓ మహిళ పెట్టిన పోస్ట్ వైరల్
  • డ్రైవర్ చెప్పింది విని తెల్లబోయిన మహిళ
క్వాల్ కామ్ అనేది సెమీకండక్టర్స్, సాఫ్ట్ వేర్ లో దిగ్గజ అమెరికన్ కంపెనీ. అందులో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడంటే మంచి గౌరవం, వేతనం, గుర్తింపు ఉంటాయని అనుకుంటాం. కానీ, క్వాల్ కామ్ కంపెనీలో ఇంజనీర్ గా పని చేస్తున్న వ్యక్తి, ఖాళీ సమయంలో రోడ్లపై క్యాబ్ నడుతున్నాడంటే నమ్మగలరా..? నమ్మి తీరాల్సిందే. ఓ మహిళ తాను ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ క్వాల్ కామ్ ఇంజనీర్ అని తెలుసుకుని విస్తు పోవడమే కాదు.. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఇతరులతో పంచుకున్నారు.

‘‘నిన్న నేను క్యాబ్ లో ప్రయాణించాను. క్యాబ్ డ్రైవర్ ఓ ఇంజనీర్. అతడు క్వాల్ కామ్ లో తన కార్పొరేట్ ఉద్యోగం కంటే క్యాబ్ నడపడం ద్వారానే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నట్టు చెప్పాడు’’ అంటూ శ్వేత కుక్రెజా పోస్ట్ పెట్టారు. చివర్లో ఆనంద బాష్పాలు రాలుస్తున్న ఎమోజీ వేశారు. ఆమె పోస్ట్ వైరల్ గా మారిపోయింది. ఇలాంటి అవాక్కయ్యే పలు ఉదాహరణలను ఇతరులు కూడా పంచుకున్నారు.

‘‘మా సొసైటీ సమీపంలో ఉండే పానీ పూరీ వాలా నెలకు రూ.3-4 లక్షలు సంపాదిస్తాడు. అతడు కేవలం 6వ తరగతి పాస్ అయ్యాడంతే. మరో ప్రాంతంలో మరో పానీ పూరీ డబ్బా తెరుస్తున్నట్టు అతడు నాతో చెప్పాడు’’ అని ఓ యూజర్ రిప్లయ్ ఇచ్చాడు. ఆందోళన చెందకండి.. టొరంటోలో కూడా ఇలాంటి పరిస్థితులే ఏడ్చాయంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. ఏదయినా కృషితో చేస్తే కాసులకు కొదవ లేదని వీరి ఉదాహరణలు గుర్తు చేస్తున్నాయి.


More Telugu News