వీళ్లకు కోర్టు తీర్పులంటే కూడా లెక్కలేదు: నారా లోకేశ్
- పెదకూరపాడు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- 2,400 కి.మీ మైలురాయిని చేరుకున్న పాదయాత్ర
- దొడ్లేరులో ఎత్తిపోతల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేశ్
- వివిధ గ్రామాల ప్రజలతో సమావేశం
- వైసీపీ నేతలపై ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 180వ రోజు పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో 2400 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకానికి లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
గురువారం నాడు మాచాయపాలెం శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్రకు దారిపొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. అనంతవరంలో టీడీపీ అభిమానులు ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేశ్ ఆవిష్కరించారు.
మాచాయపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర చండ్రాజుపాలెం, కందిపాడు, దొడ్లేరు, అనంతవరం మీదుగా క్రోసూరు శివారు క్యాంప్ సైట్ కు చేరుకుంది.
బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు!
కందిపాడులో ఓ ఇసుక లారీని గమనించిన లోకేశ్ సెల్ఫీ దిగుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఇసుకాసురులకు కోర్టు తీర్పులంటే లెక్కలేదని విమర్శించారు. పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు శివార్లలో వైసీపీ నేతలు యథేచ్చగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలు తన కంటబడ్డాయని వెల్లడించారు.
"ఇసుక తవ్వకాలు ఆపేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ మాఫియాలు యథేచ్చగా ఇసుక దోపిడీకి తెగబడుతున్నాయి. జలగన్న పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం, చట్టాలకు విలువ లేదు. వైసీపీ దొంగలకు తెలిసిందిల్లా అందినకాడికి దోచేయడం, తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయడమే" అంటూ లోకేష్ దుయ్యబట్టారు.
పలు గ్రామాల ప్రజలతో సమావేశాల సందర్భంగా లోకేశ్ వ్యాఖ్యలు...
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2410.5 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 18.9 కి.మీ.*
*181వరోజు (11-8-2023) యువగళం వివరాలు*
*పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*
సాయంత్రం
3.00 – క్రోసూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.30 – క్రోసూరు 4రోడ్ల జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
4.00 – క్రోసూరు అందుకూరు రోడ్డులో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.
6.40 – అందుకూరులో స్థానికులతో సమావేశం.
8.20 – గార్లపాడు శివారు విడిది కేంద్రంలో బస.

- జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ కరవై రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టకపోవడంతో వాస్తవ సామర్థ్యంలో 50 శాతం నీరు కూడా రైతులకు అందడం లేదు.
- టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగర్ కాల్వల ఆధునీకరణ చేపట్టి చివరి భూములకు నీరందిస్తాం.
- పులిచింతల బ్యాక్ వాటర్ ను మళ్లించే అంశాన్ని పరిశీలించి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం.
- దీర్ఘకాలంగా అటవీ భూములు, చెరువు పోరంబోకు భూములు సాగుచేసుకుంటున్న వారికి నిబంధనలకు లోబడి న్యాయం చేస్తాం.
- గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి గ్రామాల్లో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.
- దేవాలయాలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి.
- టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాల అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. కందిపాడు కొండపై ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
- వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసింది.
- మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి నైజం. 500 జనాభా దాటిన గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా చేస్తానని చెప్పిన జగన్ మాట తప్పారు. ఆవులవారిపాలెం గ్రామాన్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేస్తాం.
- కాంట్రాక్టర్లకు 1.30 లక్షల కోట్లు పెండింగ్ లో పెట్టడంతో ఈ ప్రభుత్వంలో పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు పరారవుతున్నారు.
- టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులను చెల్లిస్తాం.
- టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం.
- టీడీపీ చేపట్టిన ప్రాజెక్టులకు పేర్లు మార్చుకోవడం తప్ప నాలుగేళ్లుగా జగన్ చేసిందేమీ లేదు.
- దేశ చరిత్రలోనే నదుల అనుసంధానం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు.
- నదుల్లో ఇసుక దోచుకునేందుకు ప్రాజెక్టులనే కొట్టుకుపోయేలా చేశాడు ఇసుకాసురుడు జగన్ రెడ్డి.
- టీడీపీ వచ్చిన వెంటనే నదుల అనుసంధాన పనుల్లో వేగం పెంచుతాం. వైసీపీ నేతలకు రాజ భవనాలు... సామాన్య ప్రజలకు ముంపు ప్రాంతాల్లో స్థలాలా?
- తక్కువ ధర ఉన్న స్థలాలకు ఎక్కువ నిధుల కేటాయింపులతో సమారు రూ.7 వేల కోట్లు కొట్టేశారు. అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాల్లో అవినీతి సొమ్ము కక్కిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం.