హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రాపై పెత్తనం కోసం విషం చిమ్ముతున్నారు: విజయసాయిరెడ్డి
- హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్రపన్నుతున్నారని ఆరోపణ
- వీరిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయసాయి విజ్ఞప్తి
- సినీ కార్మికుల సంక్షేమం, మహిళల భద్రత ముఖ్యమని స్పష్టీకరణ
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం ప్రతిపక్షాలపై వరుస ట్వీట్లతో (ఎక్స్) విరుచుకుపడ్డారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తూ ఆంధ్రాపై పెత్తనం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గురువారం సాయంత్రం విమర్శలు గుప్పించారు.
ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్‌లో ఉండే కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారని, హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్రపన్నుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని సాయంత్రం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
మరో ట్వీట్‌లో సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్‌లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి, సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యమని, ఉన్నమాటంటే ఉలుకెందుకు? అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.