పెదనాన్నగారి సినిమా పెద్ద హిట్ కావాలి: 'గాండీవధారి అర్జున' ఈవెంటులో వరుణ్ తేజ్
- ప్రవీణ్ సత్తారు నుంచి 'గాండీవధారి అర్జున'
- యాక్షన్ ప్రధానంగా నడిచే కథ
- మిగతా అంశాలు కూడా ఉంటాయన్న వరుణ్ తేజ్
- 'భోళా శంకర్' హిట్ కొట్టాలంటూ ఆకాంక్ష
వరుణ్ తేజ్ - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో 'గాండీవధారి అర్జున' సినిమా రూపొందింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. యాక్షన్ కథలను స్టైలీష్ గా తెరకెక్కించడంలో ప్రవీణ్ సత్తారుకి మంచి పేరు ఉంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
అలాంటి ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంటులో వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. "ప్రవీణ్ నాకు ఈ కథ వినిపించగానే, ఇలాంటి ఒక కాన్సెప్టును చేయడం నా బాధ్యత అనిపించింది. ట్రైలర్ చూసి ఇందులో కొట్టుకోవడం ఒక్కటే ఉంటుందని అనుకోవద్దు. అంతకుమించి ఈ సినిమాలో చాలానే ఉన్నాయి" అన్నాడు.
"ఈ సినిమా చూసిన తరువాత, మనచుట్టూ ఇంత జరుగుతుందా అనిపిస్తుంది. మీ అందరికీ ఈ సినిమా నచ్చాలని ఆశిస్తున్నాను .. తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. పెదనాన్నగారి సినిమా 'భోళాశంకర్' రేపు విడుదలవుతోంది. పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పాడు. సాక్షి వైద్య కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నాజర్ కీలకమైన పాత్రను పోషించారు.