జనసేనలో చేరేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారు: కేఏ పాల్
- జనసేనలో చేరడంపై చిరంజీవి లీక్స్ ఇస్తున్నారన్న కేఏ పాల్
- చిరంజీవి జనసేన వైపు మొగ్గుతాడని తాను ముందే చెప్పానని వెల్లడి
- సిగ్గుంటే ఎవరైనా జనసేనలో చేరతారా అంటూ విమర్శలు
- పవన్ విశాఖలో వారాహి యాత్ర బీజేపీ కోసమే చేస్తున్నాడని వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి స్పందించారు. జనసేన పార్టీలో చేరేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనసేనలో చేరడంపై చిరంజీవి లీక్స్ ఇస్తున్నాడని, ఆయన జనసేన వైపు వెళతాడని తాను ముందే చెప్పానని కేఏ పాల్ వెల్లడించారు. అసలు, సిగ్గుంటే ఎవరైనా జనసేనలో చేరతారా? అని ప్రశ్నించారు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రజలను మాయ చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీలో జనసేన విలీనం తథ్యమని అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ విశాఖలో చేస్తున్న వారాహి యాత్ర కూడా బీజేపీ కోసమేనని కేఏ పాల్ విమర్శించారు. దీనిపై చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగేంద్రబాబులతో చర్చించేందుకు తాను సిద్ధం అంటూ పాల్ సవాల్ విసిరారు.
అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసేందుకు రూ.5 వేల కోట్లు తీసుకున్నారని ఆరోపణలు చేశారు