రోడ్‌షోలు, అభివాదాలు చేయొద్దు.. విశాఖలో పవన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు!
- ఈ రోజు విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పర్యటన
- ముందుగా నిర్ణయించిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లాలన్న పోలీసులు
- జగదాంబ కూడలిలో సభకు మాత్రం అనుమతి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వారాహి యాత్రను ఆయన వైజాగ్ నుంచే ప్రారంభించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ముందుగా నిర్ణయించిన దారిలో కాకుండా వేరే మార్గంలో రావాలని పవన్‌కు పోలీసులు సూచించారు.
ఎయిర్‌పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని చెప్పారు. ఎక్కడా రోడ్‌షో నిర్వహించొద్దని, అభివాదాలు కూడా చేయొద్దని స్పష్టం చేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు జగదాంబ కూడలిలో నిర్వహించే సభకు మాత్రం అనుమతి ఇచ్చారు.

వారాహి యాత్రలో భాగంగా తొలి రెండు విడతల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించారు. మూడో విడతలో భాగంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. జగదాంబ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. 14వ తేదీ దాకా విశాఖలోనే పవన్ ఉండే అవకాశం ఉంది. 15, 16 తేదీల్లో గ్యాప్ ఇచ్చి.. 17 వ తేదీ నుంచి యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు.