కాంగ్రెస్ లో విభేదాలు.. అజారుద్దీన్ సభను అడ్డుకున్న విష్ణువర్ధన్ రెడ్డి

  • జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ లో అజారుద్దీన్ సభ
  • తమకు సమాచారం ఇవ్వకుండా సభ ఎలా పెడతారంటూ విష్ణు అనుచరుల రచ్చ
  • ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట
హైదరాబాద్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో ఆ పార్టీ నేత, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సభను ఏర్పాటు చేశారు. ఆ సభను పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. 

తమ నియోజకవర్గంలో తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సభను ఎలా నిర్వహిస్తారంటూ విష్ణు అనుచరులు రచ్చ చేశారు. దీంతో వారితో అజారుద్దీన్ అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.


More Telugu News