టీవీ సెట్‌టాప్ బాక్స్ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడి మృతి
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
- కార్టూన్లు చూస్తూ కేరింతలు
- సెట్‌టాప్ బాక్స్ లాగడంతో విద్యుదాఘాతం
టీవీ సెట్‌టాప్ బాక్స్ షాక్ కొట్టిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. టీవీలో కార్టూన్లు చూస్తూ కేరింతలు కొడుతున్న కుమారుడు అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇంట్లో తండ్రి నిద్రిస్తుండగా, తల్లి వేరే పనుల్లో ఉంది. ఆ సమయంలో పిల్లాడు ఒంటరిగా టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు. ఈ క్రమంలో సెట్‌టాప్ బాక్స్‌ను లాగే ప్రయత్నం చేయడంతో అది ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.