వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ తేదీని మార్చిన ఐసీసీ
- వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న భారత్
- అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు టోర్నీ
- 9 మ్యాచ్ ల తేదీలు, ప్రారంభ సమయాల్లో మార్పులు
భారత్ లో అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. అయితే, ఈ మెగా టోర్నీ షెడ్యూల్ లో ఐసీసీ మార్పులు చేసింది. 9 మ్యాచ్ ల తేదీలు, ప్రారంభ సమయాలను సవరించింది.
ఈ మ్యాచ్ ల్లో అత్యంత ముఖ్యమైన భారత్-పాకిస్థాన్ సమరం కూడా ఉంది. దాయాదుల పోటీని అక్టోబరు 15 నుంచి 14వ తేదీకి మార్చింది. పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ తేదీని అక్టోబరు 12 నుంచి 10వ తేదీకి మార్చింది.
ఇక భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబరు 12న, ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబరు 10న, ఆసీస్-శ్రీలంక మ్యాచ్ అక్టోబరు 12న, న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబరు 13న, ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ అక్టోబరు 15న, ఆసీస్-బంగ్లాదేశ్ మ్యాచ్ నవంబరు 11న, ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్ నవంబరు 11న జరగనున్నాయి.