చిరంజీవికి నారా లోకేశ్ మద్దతు... వైసీపీ నేతలపై ఫైర్
- సత్తెనపల్లి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- చౌటపాపాయపాలెంలో భారీ బహిరంగ సభ
- చిరంజీవి మాట్లాడితే వైసీపీ కుక్కలు మొరుగుతున్నాయన్న లోకేశ్
- ఒక నోటి పారుదల మంత్రి పోయి, రెండో నోటి పారుదల మంత్రి వచ్చాడని వ్యంగ్యం
- జగన్ రూపంలో మనకు కూడా ఒక కమల్ హాసన్ ఉన్నాడని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 179వ రోజు సత్తెనపల్లి, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరెత్తింది. పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొండమోడులో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సత్తెనపల్లిలో మాజీమంత్రి, ఇన్ చార్జి కన్నాలక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు కోడెల శివరాం, అబ్బూరి మల్లేశ్వరరావు తదితరులు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు.
చౌటపాపాయపాలెంలో జరిగిన బహిరంగసభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. సభానంతరం పాదయాత్ర పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నేతృత్వంలో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది.
చౌటపాపాయపాలెం సభలో లోకేశ్ మాటల తూటాలు ఇవిగో...!
చిరంజీవి మాటల్లో తప్పేముంది?
చిరంజీవి మాట్లాడితే వైసీపీ కుక్కలు అన్నీ రోడ్ల పైకి వచ్చి మొరుగుతున్నాయి. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది? సినిమా పరిశ్రమపై రాజకీయాలు చెయ్యొద్దు అన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టండి... సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి అన్నారు.
నాలుగేళ్ల మూడు నెలల్లో జగన్ పీకింది ఏమీ లేదు కాబట్టే వైసీపీ కుక్కలకు కోపం వచ్చింది. అంబటి రాంబాబు డ్యాన్సులు వేసింది నిజం కాదా? సంజన, సుకన్యతో మాట్లాడింది నిజం కాదా? జరిగింది సినిమాలో పెడితేనే కోపం వస్తే మాకెంత కోపం రావాలి?
చంద్రబాబుని, నన్ను, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ కట్టు కథతో సినిమా తీసిన రోజు ఈ వైసీపీ కుక్కలకు విలువలు గుర్తు రాలేదా?
జగన్ రూపంలో మనకు కూడా ఒక కమల్ హాసన్ ఉన్నాడు!
జగన్ ఏపీకి కమల్ హాసన్ లాంటివాడు. అబద్ధానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అచ్చం జగన్ లానే ఉంటుంది, పోలవరం విషయంలో జగన్ చెప్పిన అబద్ధాలు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. ఎన్నికల ముందు... కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ కడుతుంది అన్నాడు.
ఇప్పుడు మాట మార్చాడు, మడమ తిప్పాడు. కేంద్రం డబ్బులు ఇస్తేనే పోలవరం అంటున్నాడు. ఒక నోటి పారుదల మంత్రి పోయాడు... రెండో నోటి పారుదల మంత్రి వచ్చాడు. డేట్ మారుతుంది కానీ, పోలవరం ఫేట్ మారటం లేదు.
టీడీపీ హయాంలోనే సత్తెనపల్లి అభివృద్ధి
టీడీపీ హయాంలోనే సత్తెనపల్లి అభివృద్ధి చెందింది. 2014 నుండి 2019 వరకూ సత్తెనపల్లికి స్వర్ణయుగం అని చెప్పాలి. రూ.1400 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు.
నోటిదూల రాంబాబు చేసిందేమిటి?
సత్తెనపల్లి ప్రజలు పాలిచ్చే ఆవుని కాదనుకొని తన్నే ఆంబోతుని తెచ్చుకున్నారు. సత్తెనపల్లిని అభివృద్ధి చేస్తాడని అంబటి రాంబాబుని గెలిపించారు. రాంబాబు నాకు పని తగ్గించాడు. సత్తెనపల్లిలో వైసీపీ కార్యకర్తలు, నాయకులే ఆయనకి ముద్దుగా నోటిదూల కాంబాబు అని పేరు పెట్టుకున్నారు.
మన రాష్ట్రం దరిద్రం ఏంటంటే నోటిదూల కాంబాబు నీటిపారుదల శాఖా మంత్రి కూడా అయ్యాడు. నీటి పారుదల శాఖా మంత్రిగా కంటే... నోటి పారుదల శాఖా మంత్రిగా అతను ఫేమస్. డయాఫ్రం వాల్ గురించి తెలియదు కానీ... సంజన గురించి తెలుసు... పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేడు కానీ... సుకన్య ఎక్కడికి రావాలో చెబుతాడు. నోటిదూల కాంబాబుకి పగలు వాగుడు... రాత్రి గోకుడు... ఇదే పని!
పోలవరం ప్రాజెక్టుకి నిధులు కావాలని ఏ రోజూ ఢిల్లీ వెళ్లని కాంబాబు సిగ్గులేకుండా పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా మీద ఫిర్యాదు చెయ్యడానికి ఢిల్లీ వెళ్లాడు.
మండలానికో బ్రోకర్ తో దోపిడీ!
మొన్నటి వరకు తమ్ముడు, ఇప్పుడు అల్లుడు, మండలానికి ఒక బ్రోకర్ని పెట్టుకొని దోచేస్తున్నాడు. ఋషికొండలా నకరికల్లు, రాజుపాలెం కొండలకి గుండు కొట్టి కోట్లు కొల్లగొడుతున్నాడు.
చికెన్ వ్యర్థాలు తరలించే వాళ్ల దగ్గరా... పుచ్చకాయలు అమ్మే బండ్లు దగ్గరా వసూళ్లు చేస్తున్నాడంటే ఎంతకి దిగజారిపోయాడో అర్థం అవుతోంది. పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలు వేయించడంలోనూ, వారి వేతనాల్లోనూ కాంబాబు వాటాలు అడుగుతున్నాడు.
పేదల ఇళ్లలోనూ అడ్డగోలు దోపిడీ
2019 ఎన్నికలకు ముందు సత్తెనపల్లిలో సెంటు స్థలం లేని అంబటి ఇప్పుడు అవినీతి సొమ్ముతో నియోజకవర్గమంతా పొలాలు, స్థలాలు కొనేశాడు... కొట్టేశాడు. సత్తెనపల్లి వినాయక హోటల్లో తురక అనిల్ అనే యువకుడు చనిపోతే ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన ఐదు లక్షల్లో రెండున్నర లక్షలు ఇస్తేనే చెక్కు ఇస్తానన్న వ్యక్తి ఈ అవినీతి కాంబాబు.
రైతుల్ని బెదిరించి ఎకరా రూ.10 లక్షలకి కొని సెంటు స్థలాల కోసం ప్రభుత్వానికి ఎకరా రూ.40 లక్షలకి అమ్మేశాడు. రూ.2 కోట్లకి భూమి కొని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వానికి రూ. 8 కోట్లకు అమ్మేందుకు కాంబాబు ప్రయత్నిస్తున్నాడు.
ఒక్క పిల్ల కాల్వ అయినా తవ్వించావా?
మైకుల ముందు రంకెలు వేయడం కాదు... ఇరిగేషన్ మంత్రిగా ఒక్క పిల్ల కాలువ అయినా తవ్వించావా? 2018లో గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు లోనే చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
దేశంలోనే తొలి నదుల అనుసంధానంతో అద్భుత ఫలితాలు తెచ్చిన చంద్రన్న ప్రయత్నాలని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్ళలేదు కాంబాబు.
80 శాతం టీడీపీ సర్కారు పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను 20 శాతం పూర్తి చేయలేని చేతకాని మంత్రివి నువ్వు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణని ఆశీర్వదించండి, టీడీపీని గెలిపించండి. అభివృద్ధి ఏంటో చూపిస్తాం.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2391.6 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.*
*180వరోజు (10-8-2023) యువగళం వివరాలు*
*పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*
ఉదయం
7.00 – మాచాయపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.45 – చండ్రాజుపాలెం వద్ద స్థానికులతో సమావేశం.
8.15 – కందిపాడులో స్థానికులతో సమావేశం.
9.45 – ఆవులవారిపాలెంలో స్థానికులతో సమావేశం.
11.15 – దొడ్లేరు శివార్లలో వైసీపీ బాధితులతో ముఖాముఖి.
మధ్యాహ్నం
12.15 – దొడ్లేరు శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – దొడ్లేరు శివారు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.45 – దొడ్లేరులో పాదయాత్ర 2400 కి.మీ.లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
6.15 – అనంతారంలో స్థానికులతో సమావేశం.
8.15 – క్రోసూరు శివారు విడిది కేంద్రంలో బస.
******