ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె యోచన విరమణ

  • తాజాగా ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీతో విద్యుత్ జేఏసీ సమావేశం
  • పీఆర్సీపై ఏకాభిప్రాయం
  • 8 శాతం ఫిట్ మెంట్, ప్రధాన వేతనస్కేలు రూ.2.60 లక్షలకు ప్రభుత్వం ఆమోదం
  • సమ్మె నోటీసులు వెనక్కి తీసుకున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
ఏపీ విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ప్రభుత్వంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మలి దశ చర్చలు ఫలప్రదం అయ్యాయి. పీఆర్సీపై ఏకాభిప్రాయం కుదరడంతో సమ్మె నోటీసులను విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 

గత కొన్నిరోజుల కిందట ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో నేడు పెన్ డౌన్, సెల్ డౌన్... రేపటి (ఆగస్టు 10) నుంచి నిరవధిక సమ్మె చేయాలని విద్యుత్ జేఏసీ నిర్ణయించింది. 

అయితే, పీఆర్సీతో పాటు 8 శాతం ఫిట్ మెంట్, ప్రధాన వేతన స్కేలు రూ.2.60 లక్షలు వంటి ప్రధాన డిమాండ్లకు ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ అంగీకరించింది. వేతన స్కేలు నిర్ధారణకు డిస్కంల సీఎండీలతో ఓ కమిటీని నియమించనున్నారు. ఈ మేరకు ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. దాంతో, రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె సంక్షోభం ముగిసినట్టయింది.


More Telugu News