చిన్నారికి 'దేవుడు' అని నామకరణం చేసిన సీఎం జగన్... వైరల్ అవుతున్న వీడియో
- గోదావరి ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
- తమ బిడ్డను సీఎం చేతుల్లో పెట్టిన దంపతులు
- D అక్షరంతో వచ్చేలా పేరు పెట్టాలని కోరిన వైనం
ఏపీ సీఎం జగన్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఆయన బాధితులను ముఖాముఖి కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
ఓ జంట తమ పసికందును సీఎం జగన్ చేతుల్లో పెట్టి, తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరింది. అంతేకాదు, ఆంగ్లంలో D అనే అక్షరంతో ఆ పేరు మొదలయ్యేలా ఉండాలని ఆ దంపతులు తెలిపారు.
మీకు నచ్చిన పేరు ఏంటని ఆ దంపతులను సీఎం జగన్ అడిగారు. మీకు నచ్చిన పేరే పెట్టండి అని వారు బదులిచ్చారు. కాస్త ఆలోచించిన సీఎం జగన్ 'దేవుడు' అంటూ ఆ బిడ్డకు నామకరణం చేశారు. బిడ్డను ముద్దాడి, తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం తన పర్యటన కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.