కాపు బిడ్డను పెళ్లి చేసుకొని, పవన్ మొదట అన్యాయం చేసింది ఉత్తరాంధ్రకే: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- చంద్రబాబు సిద్ధాంతమే జనసేన సిద్ధాంతమని విమర్శ
- గాజువాకలో ఓడిపోయినందుకే వారాహి యాత్రనా? అని ప్రశ్న
- బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న పవన్
- బ్రో.. తుస్సు బ్రో అంటూ అమర్నాథ్ వ్యంగ్యాస్త్రాలు
- నచ్చని వ్యక్తులను సినిమాలో తప్పుగా చిత్రీకరించి సంతృప్తిపడే మనస్తత్వం పవన్‌దని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సిద్ధాంతమే జనసేన సిద్ధాంతమని విమర్శించారు. విశాఖ అభివృద్ధిపై పవన్‌కు ఉన్న ఆలోచన ఏమిటో చెప్పాలన్నారు. తాము అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలన్నారు. గాజువాకలో ఓడిపోయినందుకు వారాహి విజయయాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను జనసేనాని ప్రకటించగలరా? అని నిలదీశారు. విధివిధానాలంటూ లేని పార్టీ జనసేన అన్నారు.
పవన్ కల్యాణ్ మొదట అన్యాయం చేసింది ఉత్తరాంధ్రకేనని అమర్నాథ్ ఆరోపించారు. విశాఖకు చెందిన కాపు బిడ్డను పెళ్లి చేసుకొని మోసం చేశారన్నారు. ఆయన తీరు బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం అన్నట్లుగా ఉందన్నారు. వారాహి యాత్ర ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
బ్రో.. తుస్సు బ్రో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బ్రో సినిమా హాళ్లు మొదటి రోజు సాయంత్రం నుండే ఖాళీగా కనిపించాయన్నారు. సినిమాలో కథ లేకుంటే ఎవరు కూడా ఆ సినిమాను చూడరని చెప్పారు. పవన్ కల్యాణ్ ది చిన్న పిల్లల మనస్తత్వమన్నారు. తమకు నచ్చని వ్యక్తులను సినిమాలో తప్పుగా చిత్రీకరించి సంతృప్తిపడే మనస్తత్వమన్నారు.