కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ
- ఈ అవిశ్వాసానికి విలువ లేదని తాము భావిస్తున్నామన్న మిథున్ రెడ్డి
- అధికార ఎన్డీయేకి పూర్తి మెజారిటీ ఉందని వ్యాఖ్య
- రెండు కూటముల రాజకీయాల కోసమే పెట్టారని విమర్శ
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. ఈ రోజు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగించారు. ఈ అవిశ్వాసానికి విలువ లేదని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు.
అధికార ఎన్డీయేకి పూర్తి మెజారిటీ ఉందని అన్నారు. అవిశ్వాస తీర్మానం రెండు కూటముల మధ్య రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమేనని విమర్శించారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని కేంద్రాన్ని వైసీపీ కోరుతోందని చెప్పారు. మణిపూర్‌లో అత్యాచార ఘటనలు బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.