భారీ నష్టాల్లోకి జారుకుని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 149 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 62 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
- రెండున్నర శాతానికి పైగా పెరిగిన జేఎస్ డబ్ల్యూ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ట్రేడింగ్ చివర్లో మళ్లీ పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 149 పాయింట్లు లాభపడి 65,996కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 19,633 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.68%), టాటా మోటార్స్ (2.57%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.35%), టాటా స్టీల్ (1.74%), ఐటీసీ (1.36%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-0.87%), మారుతి (-0.87%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.52%), ఏసియన్ పెయింట్స్ (-0.47%).