అర్చకుడిపై దాడి అధికార పార్టీ దాష్టీకానికి ప్రతీక: పవన్ కల్యాణ్
- భీమవరం సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి
- ఎవరి కళ్లలో ఆనందం కోసం దాడి చేశారని ప్రశ్నించిన పవన్
- యథా నాయకుడు–తథా అనుచరుడు అనేలా వైసీపీ వాళ్లు తయారయ్యారని విమర్శ
భీమవరం పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని నిలదీశారు. ఇది పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి ప్రతీక అని ఆగ్రహం వ్యక్తం చేశారు.