ఆలయంలో భక్తులను వణికించిన టెర్రరిస్ట్.. చెంప చెళ్లుమనిపించిన భక్తుడు.. వీడియో ఇదిగో!
- మహారాష్ట్ర ఆలయంలో పోలీసుల మాక్ డ్రిల్
- ప్రజలకు అవగాహన కల్పించేందుకేనని వివరణ
- విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్న భక్తులు
మహారాష్ట్రలోని స్వామినారాయణ్ ఆలయంలోకి సడెన్ గా ఓ టెర్రరిస్టు ప్రవేశించాడు.. దీంతో అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్తా భయానకంగా మారింది. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆందోళనతో వణికిపోయారు. ఓ భక్తుడికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది.. టెర్రరిస్టు చేతిలో గన్ ఉన్నప్పటికీ వెరవకుండా నేరుగా వెళ్లి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో కంగుతినడం సదరు టెర్రరిస్టు వంతయింది. చివరకు ఇదంతా పోలీసుల మాక్ డ్రిల్ అని తెలిసి భక్తులు నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధూలె సిటీలోని ప్రఖ్యాత స్వామినారాయణ్ టెంపుల్ లో చోటుచేసుకుందీ ఘటన.. టెర్రర్ దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందిస్తారనే విషయం తెలుసుకోవడంతో పాటు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వామినారాయణ్ ఆలయంలోకి నల్లటి దుస్తులు, చేతిలో గన్ తో ఓ టెర్రరిస్ట్ సడెన్ గా ఎంటరయ్యాడు. లోపలికి రావడంతోనే ఓ భక్తుడిని బంధించి, గన్ తో మిగతా వారిని బెదిరించాడు. దీంతో ఆలయంలోని భక్తులు భయంతో వణికిపోయారు.
ఓ భక్తుడు మాత్రం కోపం పట్టలేక టెర్రరిస్టు దగ్గరికి వెళ్లి చెంప చెళ్లుమనిపించాడు. ఈ రియాక్షన్ తో సదరు టెర్రరిస్టు కంగుతిన్నాడు. ఇంతలో అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి భక్తుడిని ఆపారు. నల్ల దుస్తుల్లో ఉన్న వ్యక్తి నిజమైన టెర్రరిస్ట్ కాడని, ఇదంతా మాక్ డ్రిల్ అని చెప్పారు. ఓ పోలీస్ అధికారికి టెర్రరిస్ట్ వేషం వేసి ఆలయంలోకి పంపించినట్లు వివరించారు. దీంతో అప్పటి వరకు భయాందోళనలకు గురైన భక్తులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.