నల్లగా ఉన్నాడంటూ భర్తను అవమానించడం క్రూరత్వమే: కర్ణాటక హైకోర్టు

  • గొడవ జరిగినప్పుడల్లా నల్లగా ఉన్నావంటూ భర్తపై తిట్లు
  • భరించలేక కోర్టును ఆశ్రయించిన భర్త
  • గృహహింస చట్టం కింద కేసు పెట్టిన భార్య
  • ఆమె ఆరోపణలు నిరాధారమని తేలుస్తూ విడాకులు మంజూరు చేసిన కోర్టు
నల్లగా ఉన్నాడని భర్తను పదేపదే అవమానించడం క్రూరత్వం కిందికే వస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేస్తూ ఓ జంటకు విడాకులు మంజూరు చేసింది. 2007లో వారికి వివాహమైంది. ప్రస్తుతం అతడి వయసు 44 ఏళ్లు కాగా, ఆమె వయసు 41 సంవత్సరాలు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు పొడసూపాయి. మాటల మధ్యలో ఆమె భర్తను నల్లగా ఉన్నావని తిట్టేది. దీంతో విసుగు చెందిన ఆయన వేరుగా ఉంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు.

దీంతో ఆమె గృహహింస చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. ఆయనకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని ఆరోపించింది. విడాకుల పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చడంతో భర్త హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం.. భర్తపై చేసిన వివాహేతర సంబంధాల ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొంది. నల్లగా ఉన్నాడని భర్తను అవమానించడం క్రూరత్వమేనని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.


More Telugu News