విదేశీ శక్తులు భారత్‌ను ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెప్పే రోజులు పోయాయి: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

  • తప్పుడు సమయంలో.. తప్పుడు పద్ధతిలో అవిశ్వాస తీర్మానమన్న కేంద్రమంత్రి
  • ప్రతిపక్ష కూటమి పశ్చాత్తాపపడక తప్పదని వ్యాఖ్య
  • మణిపూర్‌పై శ్రద్ధ పెట్టాలని గత యూపీఏ ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పామని స్పష్టీకరణ
  • ప్రధాని మోదీ ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టారన్న రిజిజు
ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానాన్ని తప్పుడు సమయంలో, తప్పుడు పద్ధతిలో తీసుకు వచ్చారని, ఇందుకు వారు వారు పశ్చాత్తాపపడక తప్పదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో అన్నారు. ప్రస్తుతం భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈశాన్య ప్రాంతాలపై కాస్త శ్రద్ధ పెట్టాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఎన్నోసార్లు వేడుకున్నామని, కానీ ఈరోజు మణిపూర్‌పై కాంగ్రెస్ విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొన్న జాతి వివక్ష, దౌర్జన్యాలను గత యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చాలామంది ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాతి వివక్ష, దౌర్జన్యాలను ఎదుర్కొన్నారన్నారు. 2014 తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. మొదటిసారి గౌహతిలో సమావేశం నిర్వహించి, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతకు ప్రధాని ఆదేశించారన్నారు. ప్రధాని మోదీ ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేస్తూ వారి ఆదరణ చూరగొంటున్నారన్నారు.

దేశానికి వ్యతిరేకంగా పని చేస్తూ తమ కూటమికి I.N.D.I.A. అని పేరు పెట్టుకుంటే ఉపయోగం లేదన్నారు. దేశంలో బలమైన నాయకత్వం ఉందని, కాబట్టి భారత అంతర్గత విషయాలలో ఏ విదేశీ శక్తి జోక్యం చేసుకోలేదన్నారు. విదేశీ శక్తులు భారత్‌ను ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెప్పే రోజులు పోయాయని, కాబట్టి మన అంతర్గత విషయాల్లో ఏ విదేశీ శక్తి జోక్యం చేసుకోలేదన్నారు.


More Telugu News