అమరావతిపై ఎన్నికల ముందు జగన్ ఏమన్నాడు?: లోకేశ్

  • పిడుగురాళ్లలో లోకేశ్ బహిరంగ సభ
  • అమరావతిలోనే రాజధాని అని నాడు జగన్ అన్నారని వెల్లడి
  • జగన్ అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేశాడని ఆగ్రహం
  • ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలకు సిగ్గుంటే జగన్ ను నిలదీయాలని డిమాండ్
సీఎం జగన్ 420 అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలు 840లు అని నారా లోకేశ్ విమర్శించారు. జగన్ అమ్మను, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశాడని, గుంటూరు జిల్లా వైసీపీ నేతలు అమ్మ లాంటి అమరావతిని చంపేశారని విమర్శించారు. పిడుగురాళ్లలో యువగళం పాదయాత్ర సభ సందర్భంగా లోకేశ్ వాడీవేడి ప్రసంగం చేశారు. సీఎం జగన్ ఎన్నికల ముందు అమరావతిపై ఏం మాట్లాడారో గుర్తు చేశారు.

"రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి అన్నాడు జగన్, అసెంబ్లీ లో అమరావతికి జై కొట్టాడు. కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అన్నాడు.    ఎన్నికల ముందు అమరావతిలోనే రాజధాని అన్నాడు. ఆ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలు అంతా... అమరావతే రాజధాని, అందుకే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు అని అన్నారు. కానీ గెలిచిన తరువాత ఏం అయ్యింది? జగన్ మాట మార్చాడు... మడమ తిప్పాడు.

రాష్ట్రానికి లైఫ్ లైన్ అయిన అమరావతిని జగన్ విధ్వంసం చేశాడు. అమరావతిని శ్మశానం అన్నాడు, అమరావతిలో భూకంపాలు వస్తాయి అన్నాడు, వర్షం వస్తే మునిగిపోతుంది అన్నాడు. కానీ, జగన్ కుట్రలను తట్టుకొని నిలబడింది అమరావతి. సుదీర్ఘ పోరాటం చేసి సైకోకి సినిమా చూపించారు అమరావతి రైతులు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నాయకులకు సిగ్గుంటే, పుట్టిన ప్రాంతంపై ప్రేమ ఉంటే జగన్ ని నిలదీయాలి. పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం" అంటూ లోకేశ్ టీడీపీ వైఖరిని స్పష్టం చేశారు.


More Telugu News