దొంగోడి ఇంట్లోనే దొంగలు పడడం ఏంది జగన్?: నారా లోకేశ్

  • గురజాల నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • పిడుగురాళ్లలో బహిరంగ సభ
  • జగన్ అంత పిరికి వ్యక్తిని తాను చూడలేదన్న లోకేశ్
  • రాళ్లేసే వాళ్లకు, తమ ఫ్లెక్సీలు చించేవాళ్లకు నెక్ట్స్ బర్త్ డే ఉండదని వార్నింగ్
  • సీఎం జగన్ ఆఫీసు దొంగలు పడ్డారని వెల్లడి 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో జరుగుతోంది. పిడుగురాళ్లలో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. 

జగన్ అంత పిరికి వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. లోకేశ్ పాదయాత్ర చేస్తే జగన్ కి భయం... చంద్రబాబు గారు ప్రాజెక్టులు చూడటానికి వెళ్లినా జగన్ కు భయమేనని ఎద్దేవా చేశారు. జగన్ ప్రజల్లోకి వెళ్ళడు, ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ ప్యాలస్ లో పడుకుంటాడు... మేము ప్రజల్లోకి వెళితే మాత్రం వైసీపీ వాళ్ళని పంపి రాళ్లేస్తారు అంటూ విమర్శించారు. 

"రాళ్లేస్తే పారిపోవడానికి మాది బులుగు జెండా కాదు బ్రదర్ దమ్మున్న పసుపు జెండా. రాళ్లేస్తాం, ఫ్లెక్సీలు చించుతాం అంటూ ఎవడైనా వస్తే నెక్ట్స్ బర్త్ డే ఉండదు" అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. 

ఆ వార్త  వినగానే నాకు మూడు డౌట్లు వచ్చాయి

పబ్జీ జగన్ ఇంట్లో దొంగలు పడ్డారని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆ వార్త వినగానే తనకు మూడు డౌట్లు వచ్చాయని వెల్లడించారు. "మొదటి డౌట్... సీఎం ఇంట్లో దొంగలు ఎలా పడ్డారు? రెండో డౌట్... దొంగలు పడినప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు? మూడో డౌట్... దొంగ ఇంట్లో దొంగలు ఎలా పడ్డారు?

దొంగ ఇంట్లో దొంగలు పడ్డారు అని తేలిపోయింది. సీఎం డిజిటల్ సైన్ ఉపయోగించి 225 ఫైళ్లు సెటిల్మెంట్ చేశారు. ఆయనకు తెలియకుండా ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి. కోట్లు చేతులు మారాయి. ఆ టైంలో జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా? పబ్జీ ఆడుకుంటున్నాడు. 

మన సీఎం ఎవరు? 420... 420 చుట్టూ 420లే ఉంటారు.    అందుకే ఏకంగా సీఎం ఆఫీస్ లోనే దొంగతనం జరిగింది. అటెండర్లు, డేటా ఆపరేటర్ల మీద కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ స్కాం వెనుక మాస్టర్ మైండ్ ఎవరు, పెద్ద తలకాయలు ఎవరు అనేది తేలాలి?" అని డిమాండ్ చేశారు.


More Telugu News