మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు
- మాచర్ల నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- పిన్నెల్లిపై విమర్శనాస్త్రాలు
- లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పిన్నెల్లి
- గురజాలలో ప్రెస్ మీట్ పెట్టి పిన్నెల్లిని విమర్శించిన టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, యువగళం పాదయాత్ర ప్రదేశం (గురజాల)లో టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, జీ.వీ.ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యేల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంలో విరుచుకుపడ్డారు.
పిన్నెల్లి అనే పిచ్చి కుక్క మొరుగుతోంది: జూలకంటి బ్రహ్మారెడ్డి
లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజా వెల్లువ చూసి మాచర్ల ఎమ్మెల్యే అనే పిచ్చి కుక్క మొరుగుతోంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్నాడు.
లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదివి వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగం చేశారు. చంద్రబాబు, లోకేశ్ లతో పోల్చితే మాచర్ల సన్నాసివైన నువ్వెంత... నీ బతుకెంత? అసలు నీ చరిత్ర ఏంటో చెప్పు సన్నాసీ?
పెద్దిరెడ్డే పెద్దాయనా... చంద్రబాబు పెద్దాయన కాదా? నువ్వొక విగ్రహాల దొంగవి అంటే ఎప్పుడైనా కాదని చెప్పావా? ప్రజల సొమ్ము తిని ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడకు. మాచర్లలో నీ బతుకేంటో అందరికీ తెలుసు పిన్నెల్లీ. పాడుబడిన అద్దెకొంపలో టార్పాలిన్ పట్ట కప్పుకొని బతికిన నువ్వు, నేడు ప్రజల సొమ్మ తిని బరితెగించి మాట్లాడుతున్నావు.
మా పార్టీ ఆపుతోంది... లేకపోతే పిన్నెల్లి ఎక్కడుంటాడో తెలియదు: యరపతినేని
కారంపూడి బహిరంగ సభలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలపై లోకేశ్ మాట్లాడారు. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో మాచర్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పారు. లోకేశ్ ఎక్కడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడలేదు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం లోకేశ్, చంద్రబాబులతో పాటు మాపై నోరుపారేసుకున్నాడు. జగన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని బంగాళాఖాతంలో పడేయాలి... కాల్చి చంపాలి అన్నాడు. ఆనాడు ఆ భాష రామకృష్ణారెడ్డికి నచ్చింది. లోకేశ్ హుందాగా రాజకీయంగా మాట్లాడిన భాష బాగోలేదా?
కేసులు లేకుండా చూడాలని నన్ను బతిమాలుకున్న సంగతి మర్చిపోయావా పిన్నెల్లీ? మాచర్ల ఎమ్మెల్యే అతని సోదరుడు ఇద్దరూ విగ్రహాల దొంగలే. గుళ్లల్లో విగ్రహాలు కాజేసి జైలుకెళ్లి వచ్చారు. తెలుగుదేశం పార్టీ లక్ష్మణరేఖ గీసింది కాబట్టే, ఆచితూచి వ్యవహరిస్తున్నాం. మేం ఆ రేఖ దాటితే పిన్నెల్లి ఎక్కడుంటాడో కూడా తెలియదు.
పిన్నెల్లీ... నిన్ను ఓడించడానికి లోకేశ్ రావాలా?... బ్రహ్మారెడ్డి చాలు: ప్రత్తిపాటి
సభ్యత, సంస్కారంతో మాట్లాడితే ఎవరికైనా మంచిది. లోకేశ్ తన అవినీతిని ప్రశ్నించాడని పిన్నెల్లి ఉక్రోషపడుతున్నాడు. పిన్నెల్లికి దమ్ము, ధైర్యముంటే లోకేశ్ చెప్పినదానిపై బ్రహ్మరెడ్డితో బహిరంగ చర్చకు రావాలి. లోకేశ్ చెప్పినదానిలో ఏది వాస్తవం కాదో పిన్నెల్లి చెప్పాలి.
రామకృష్ణారెడ్డిని ఓడించడానికి లోకేశ్ దాకా ఎందుకు... బ్రహ్మారెడ్డి చాలు... డిపాజిట్లు రాకుండా చేస్తాడు. లోకేశ్, చంద్రబాబులను దుర్భాషలాడే పిన్నెల్లి, కొడాలి, వంశీ, రాంబాబు లాంటి వాళ్లందరికీ భవిష్యత్ చెప్పుకోలేని విధంగా ఉంటుంది. లోకేశ్ స్థాయి ఏంటి.. నీ స్థాయి ఏంటి పిన్నెల్లి? నువ్వు మా యువ నాయకుడికి ఛాలెంజ్ చేస్తావా? నీకు చేతనైతే లోకేశ్ చెప్పింది అంతా అవాస్తవమని ప్రజల మధ్య నిరూపించుకో.
ప్రజలు, సొంతపార్టీ వాళ్లే అసహ్యించుకునే స్థాయి నీది... ప్రజలు అభిమానించి, ఆరాధించే స్థాయి బ్రహ్మారెడ్డిది. రామకృష్ణారెడ్డి అక్రమాలు, అవినీతి దెబ్బకు ఊళ్లకుఊళ్లే ఖాళీ అయ్యాయి. ఆ ప్రజల ఉసురు తగిలి రామకృష్ణారెడ్డి పతనం కావడం ఖాయం.
ఈసారి వార్డు మెంబర్ గా కూడా గెలవరు: జీ.వీ.ఆంజనేయులు
జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను ఆంబోతుల్లా జనంపైకి వదిలేశాడు. జగన్ అండతో ప్రజల సొమ్ము దోచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అడ్డూ, ఆపు లేకుండా మాట్లాడుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబుని, లోకేశ్ ను అనే అర్హత, స్థాయి నీకున్నాయా పిన్నెల్లి?
నీకు, మీ పార్టీవాళ్లకు దమ్ముంటే ఈ సారి పంచాయతీలో ఒక వార్డులో గెలిచి చూపించండి. బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి ఈసారి వార్డ్ మెంబర్లుగా గెలవగలరా అని ఛాలెంజ్ చేస్తున్నాం. బ్రహ్మారెడ్డి వచ్చే ఎన్నికల్లో రామకృష్ణారెడ్డిని 40 వేల ఓట్లతేడాతో మట్టికరిపిస్తాడు.