అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం.. ఏయే పార్టీకి ఎంత సమయం కేటాయించారంటే..!
- చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
- మొత్తం చర్చకు 16 గంటల సమయం కేటాయింపు
- వైసీపీకి 29 నిమిషాలు, బీఆర్ఎస్ కు 12 నిమిషాలు మాట్లాడే అవకాశం
మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ ప్రారంభమయింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. సభలో సంఖ్యాబలం లేదనే విషయం తమకు తెలుసని... అయినా అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిన పరిస్థితిని తమకు కల్పించారని విమర్శించారు. మణిపూర్ హింస నేపథ్యంలో ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. మణిపూర్ కు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు అవిశ్వాసంపై చర్చకు మొత్తం 16 గంటల సమయాన్ని స్పీకర్ ఓం బిర్లా కేటాయించారు. ఇందులో బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్ కు 1 గంట 9 నిమిషాలు, వైసీపీకి 29 నిమిషాలు, బీఆర్ఎస్ కు 12 నిమిషాలు, డీఎంకేకు 30 నిమిషాలు, తృణమూల్ కు 30 నిమిషాలను కేటాయించారు.