ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాలో ఓ ఎన్నారైకి కీలక బాధ్యతలు
- టెస్లా ప్రస్తుత సీఎఫ్ఓ జాచరీ అకస్మాత్తుగా రాజీనామా
- సంస్థ కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులైన వైభవ్ తనేజా
- ఢిల్లీ యూనివర్సిటీ పట్టభద్రుడైన తనేజాకు అకౌంటింగ్‌లో 20 ఏళ్ల విశేష అనుభవం
- అకౌంటింగ్ హెడ్, భారత విభాగం అధిపతిగా ఉన్న తనేజాకు సీఎఫ్ఓగా అదనపు బాధ్యతలు
ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో ఓ భారతీయుడికి కీలక బాధ్యతలు దక్కాయి. సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వైభవ్ తనేజా బాధ్యతలు చేపట్టారు. గత 4 ఏళ్లుగా సీఎఫ్ఓగా ఉన్న జాచరీ రిర్కోర్న్ తప్పుకోవడంతో సంస్థ ఆర్థికపగ్గాలు వైభవ్ చేతుల్లోకి వెళ్లాయి. టెస్లాలో దాదాపు 13 ఏళ్ల పాటు సేవలందించిన జాచరీ అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో సంస్థ షేర్లు 3 శాతం మేర పతనమయ్యాయి.
టెస్లాలో జాచరీ ‘మాస్టర్ ఆఫ్ కాయిన్’గా పేరుపొందారు. అయితే, సీఎఫ్ఓ బాధ్యతల బదిలీ సజావుగా సాగేందుకు ఆయన ఈ ఏడాది చివరి వరకూ టెస్లాలో కొనసాగనున్నారు. సంస్థలో పని చేయడం ఓ ప్రత్యేక అనుభవమని ఈ సందర్భంగా జాచరీ వ్యాఖ్యానించారు. 13 ఏళ్ల పాటు సంస్థకు సేవలందించినందుకు గర్వపడుతున్నానని చెప్పారు.
ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వైభవ్ కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. అకౌంటింగ్‌లో 20 ఏళ్ల విశేష అనుభవం ఉన్న ఆయన, టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్ వంటి విభిన్న రంగాలకు చెందిన సంస్థల్లో పనిచేశారు. 2016లో ఆయన టెస్లాలో చేరారు. ప్రస్తుతం ఆయన అకౌంటింగ్ హెడ్‌గా ఉన్నారు. 2021లో ఆయన టెస్లా భారతీయ విభాగానికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత బాధ్యతలతో పాటూ సంస్థలో ‘మాస్టర్ ఆఫ్ కాయిన్’గా బాధ్యతలూ నిర్వహిస్తానని చెప్పారు.