సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ స్పందన
- గద్దర్ అంతిమయాత్రలో విషాద ఘటన
- తీవ్ర అస్వస్థతకు గురై మరణించిన జహీరుద్దీన్ అలీ ఖాన్
- ఉర్దూ పత్రికా రంగానికి తీరని లోటు అని పేర్కొన్న సీఎం కేసీఆర్
ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర సందర్భంగా సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అంతిమయాత్రలో తోపులాట సందర్భంగా కిందపడిపోయిన జహీరుద్దీన్ తిరిగి లేవలేదు. ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
ఉర్దూ పాత్రికేయ రంగంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. జహీరుద్దీన్ మృతి నేపథ్యంలో సంతాపం తెలియజేశారు. జహీరుద్దీన్ మరణం ఉర్దూ పత్రికా ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
పత్రికా సంపాదకుడిగా తెలంగాణ ఉద్యమంలో అలీ ఖాన్ ప్రముఖ పాత్ర పోషించారని, విశేష రీతిలో సేవలు అందించారని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ విషాద సమయంలో అలీ ఖాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు.