ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: మద్దతు తెలిపిన వైసీపీ, టీడీపీ

  • బిల్లుకు అనుకూలంగా 131 మంది, ప్రతికూలంగా 102 మంది ఓటు
  • రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్న కేంద్రం
  • రాష్ట్రపతి ఆమోదంతో చట్టం కానున్న ఢిల్లీ ఆర్డినెన్స్
ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం కూడా లభించింది. సోమవారం నాడు ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 131 మంది, వ్యతిరేకంగా 102 మంది ఓటు వేశారు. ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో కేంద్రం బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం కానుంది. 

మొదట మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే విపక్షాలు డివిజన్‌కు పట్టుబట్టడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. సాంకేతిక సమస్యతో స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు. 

బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ఢిల్లీ ఆర్డినెన్స్ అంశంలో సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించలేదన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మద్దతు పలికాయి. బీఎస్పీ, బీజేడీ కూడా ఎన్డీయేకు అనుకూలంగా ఓటేశాయి.


More Telugu News