ఆ విషయం తెలిసి నాకు చాలా బాధ కలిగింది: ఉపాసన
- అపోలో హాస్పిటల్స్ లో చిల్డ్రన్స్ విభాగం ప్రారంభం
- లోగోను ఆవిష్కరించిన ఉపాసన
- చాలామంది గర్భవతులకు సరైన మద్దతు ఉండదని వెల్లడి
- వారాంతాల్లో అపోలో ఆసుపత్రుల్లో ఉచితంగా ఓపీడీ చికిత్స
- సింగిల్ మదర్ పిల్లలకు వర్తిస్తుందని వివరణ
వారాంతాల్లో అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సను అందిస్తున్నామని అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని కొణిదెల వెల్లడించారు.
తాజాగా అపోలో హాస్పిటల్స్ చిన్న పిల్లల కోసం అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రారంభించింది. ఈ అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగోను ఉపాసన ఆవిష్కరించారు. కార్యక్రమంలో అపోలో డాక్టర్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడారు.
"నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది నన్ను కలిసి వారి సలహాలను ఇచ్చేవారు. అయితే కొందరు మహిళలకు ఇలాంటి సహకారం దొరకదు. ఆ విషయం తెలిసి నాకు చాలా బాధవేసింది. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు ఇలాంటి విషయాల్లో పెద్దగా మద్దతు ఉండదు. కాబట్టి అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా నేను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నాను. వీకెండ్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సను అందించబోతున్నాం.
ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నేను వారికి నా వంతు సపోర్ట్ అందించటానికి సిద్ధం. ఈ ప్రకటన చేయటానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
అపోలో పీడియాట్రిక్, అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.