మణిపూర్ విద్యార్థులకు కేరళ యూనివర్సిటీ ఆహ్వానం

  • హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపూర్‌లో చదువుకు ఆటంకం
  • అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం రావొచ్చన్న కన్నూర్ వర్సిటీ 
  • మణిపూర్ విద్యార్థి సంఘాల నుండి విజ్ఞప్తులు వచ్చాయన్న వీసీ
మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రానికి చెందిన కన్నూర్ యూనివర్సిటీ.. మణిపూర్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. అక్కడి విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయాలనుకుంటే కేరళ రావొచ్చునని, తమను సంప్రదించాలని కన్నూర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ గోపినాథ్ రవీంద్రన్ అన్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునేవారు రావొచ్చునని చెప్పారు.

మణిపూర్ విద్యార్థి సంఘాల నుండి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అంశంపై యూనివర్సిటీ సిబ్బందితో చర్చించాక ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. వారి అవసరాలకు తగినట్లుగా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామన్నారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక సీట్లను కేటాయిస్తామని, విద్యార్థులు తమ విద్యార్హత పత్రాలను సమర్పించేందుకు కూడా అవసరమైన సమయం ఇస్తామన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రవేశం కోసం ఓ మణిపూర్ విద్యార్థి ఆసక్తి కనబరిచారన్నారు.


More Telugu News