ఫరియా ఫస్టు వెబ్ సిరీస్ గా 'ది జెంగబూరు కర్స్' .. రెండు రోజుల్లో స్ట్రీమింగ్!
- ఫరియా ప్రధాన పాత్రగా 'ది జెంగబూరు కర్స్'
- ఒడిశా నేపథ్యంలో నడిచే కథ
- ముఖ్య పాత్రల్లో నాజర్ - మకరంద్ దేశ్ పాండే
- ఈ నెల 9వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్
ఫరియా అబ్దుల్లా 'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. నటన పరంగా .. గ్లామర్ పరంగా ఈ బ్యూటీకి వంకబెట్టవలసిన అవసరం లేదు. అయితే హైట్ కారణంగా అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని చెప్పాలి. దాంతో ఆమె వెబ్ సిరీస్ ల దిశగా దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆమె ఫస్టు వెబ్ సిరీస్ గా 'ది జెంగబూరు కర్స్' రూపొందింది.
ఈ వెబ్ సిరీస్ ఈ నెల 9వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అప్ డేట్స్ 'సోనీ లివ్' సెంటర్ నుంచి వదులుతూనే ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ లో 'ప్రియ' అనే పాత్రలో ఫరియా కనిపించనుంది. ఆమె పాత్రనే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. ముఖ్యమైన పాత్రలలో నాజర్ - మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు.
ప్రియ తండ్రి కనిపించకుండా పోవడంతో, ఆయన్ను వెతుక్కుంటూ ఆమె బయలుదేరుతుంది. అలా ఆమె ఒడిశా సమీపంలోని 'జెంగబూరు' అనే గ్రామానికి వస్తుంది. అక్కడి ఖనిజ సంపద కోసం కొంతమంది అవినీతి పరులు ఆదిమవాసులకు అన్యాయం చేయడం చూస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఫలితంగా ఎలాంటి చిక్కుల్లో పడుతుంది? అనేదే కథ.