ఆ సినిమా అలా దెబ్బకొట్టేసింది .. ఈ సినిమా ఇలా ఆగిపోయింది: డైరెక్టర్ పవన్ సాదినేని
- పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన 'దయా'
- 'సావిత్రి' ఫ్లాప్ ను ఊహించలేదన్న డైరెక్టర్
- కల్యాణ్ రామ్ తో ప్రాజెక్టు సెట్ కాలేదని వ్యాఖ్య
- బెల్లంకొండ గణేశ్ ను తాను పరిచయం చేయవలసిందని వెల్లడి
పవన్ సాదినేని .. విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో ఇంతకుముందు 'ప్రేమ ఇష్క్ కాదల్' .. ' సావిత్రి' .. 'సేనాపతి' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజేంద్రప్రసాద్ ప్రధానమైన పాత్రను పోషించిన 'సేనాపతి', పవన్ సాదినేనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'దయా' వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
తాజాగా 'ఫిల్మ్ ట్రీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'సావిత్రి' కథ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడిని. నారా రోహిత్ చేసిన ఆ సినిమా ఒక మంచి ప్రయత్నంగా భావించాను. అయితే ఫలితం దగ్గరికి వచ్చేసరికి దెబ్బకొట్టేసింది. ఆ సినిమా తరువాత నేను కల్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నాను. హరికృష్ణగారి మరణం కారణంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు" అని అన్నారు.
"బెల్లంకొండ గణేశ్ ను హీరోగా నేను పరిచయం చేయవలసింది. ఆయన హీరోగా 20 రోజుల పాటు షూటింగు కూడా చేశాము. ఆ తరువాత కరోనా విరుచుకుపడింది .. రెండేళ్ల వరకూ ఆ ప్రాజెక్టు జోలికి వెళ్లలేకపోయాము. ఆ తరువాత కమిట్ మెంట్స్ మారిపోయాయి. తీసిన పుటేజ్ కూడా పనికిరాకుండా పోయింది" అంటూ చెప్పుకొచ్చారు.