విమానం, రైలు, బస్ టికెట్లపై పేటీఎం ఆకర్షణీయ ఆఫర్లు

  • విమాన టికెట్ బుకింగ్ లపై 10-15 శాతం డిస్కౌంట్
  • 2,500 బస్ ఆపరేటర్ల సర్వీసులపై 25 శాతం తగ్గింపు
  • రైలు టికెట్ల బుకింగ్ లపై సున్నా చార్జీలు
  • ఈ నెల 10 వరకు అమల్లో ఆఫర్లు
విహార యాత్ర లేదంటే అత్యవసర ప్రయాణం ఏదైనా కావచ్చు.. విమానం, రైలు, బస్ టికెట్ల బుకింగ్ లపై పేటీఎం పలు ఆఫర్లు ప్రక టీంచింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ‘ఫ్రీడమ్ ట్రావెల్ కార్నివాల్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. అంటే ఈ నెల 10వ తేదీ వరకు చేసుకునే బుకింగ్ లపై తగ్గింపులు పొందొచ్చు. 

ఫ్లయిట్ టికెట్స్
దేశీయ విమాన ప్రయాణ బుకింగ్ లపై 15 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది. అదే ఇంటర్నేషనల్ ట్రావెల్ బుకింగ్ లపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కాకపోతే ఆర్ బీఎల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపైనే ఈ తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ కార్డులు లేని వారు.. పేటీఎం వ్యాలెట్ కు మనీ లోడ్ చేసుకుని బుక్ చేసుకుంటే డొమెస్టిక్ ఫ్లయిట్ టికెట్లపై 12 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా బుక్ చేసుకున్నా ఇంతే మేర డిస్కౌంట్ పొందొచ్చు. ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఎయిరేషియా, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియాతో ఒప్పందం చేసుకుని పేటీఎం ఈ ఆఫర్లు అందిస్తోంది. విద్యార్థులు, వృద్ధులు, సాయుధ దళాల్లో పనిచేసే వారికి ఫ్లయిట్ టికెట్లపై కన్వీనియన్స్ చార్జీ లేకుండా బుకింగ్ లకు అవకాశం కల్పిస్తోంది.

బస్ టికెట్లు
పేటీఎం ప్లాట్ ఫామ్ ద్వారా బస్ టికెట్లు బుక్ చేసుకుంటే 25 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కొన్ని ఆపరేటర్ల సర్వీసులపై అదనంగా మరో 20 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తోంది. 2,500 బస్ ఆపరేటర్ల టికెట్లపై ఈ తగ్గింపు లభిస్తుంది.

రైలు టికెట్లు
పేటీఎం నుంచి రైలు టికెట్లను బుక్ చేసుకుంటే, యూపీఐ ద్వారా చెల్లిస్తే చార్జీలు విధించడం లేదు. 

ఉచితంగా క్యాన్సిలేషన్
ఫ్లయిట్, బస్, రైటు టికెట్ల ఫ్రీ క్యాన్సిలేషన్ సదుపాయాన్ని కూడా పేటీఎం అందిస్తోంది. అంటే ఏ కారణం వల్ల అయినా బుక్ చేసుకున్న టికెట్ ను రద్ధు చేసుకున్నారని అనుకుంటే, అప్పుడు నూరు శాతం వెనక్కి వస్తుంది. ఇది ఎంతో అనుకూలమైన ఫీచర్. ఐఆర్ సీటీసీ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకుని, రద్దు చేసుకుంటే కొంత చార్జీలు నష్టపోవాల్సి వస్తుంది. ఫ్లయిట్ సర్వీసుల్లో అయితే నూరు శాతం వెనక్కి రాదు. కానీ పేటీఎంపై బుక్ చేసుకోవడం ద్వారా ఈ నష్టం లేకుండా చూసుకోవచ్చు.


More Telugu News