‘చోళీకే పీచే క్యా హై’ పాట వివాదంపై దశాబ్దాల తర్వాత స్పందించిన దర్శకుడు
- 1993లో వచ్చిన ఖల్‌నాయక్ సినిమా
- చోళీకే పీచే క్యా హై పాట అసభ్యకరంగా ఉందంటూ నిరసనలు
- ఆ పాటకు ఆ ముద్ర వేయడం తనను షాక్‌కు గురిచేసిందన్న సుభాష్ ఘాయ్
- దానిని ఫోక్ సాంగ్‌లా తీశామన్న దర్శకుడు
1993లో వచ్చిన ‘ఖల్ నాయక్’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా అందులోని ‘చోళీ కే పీచే క్యా హై’ పాట దుమ్మురేపింది. అప్పట్లో ఎక్కడ చూసినా అదే పాట. ఆ పాటతోపాటే వివాదాలు చుట్టుముట్టాయి. పాట అసభ్యకరంగా ఉందంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇన్ని దశాబ్దాల తర్వాత తాజాగా ఆ సినిమా దర్శకుడు సుభాష్ ఘాయ్ ఆ పాటపై స్పందించారు.
అప్పట్లో ఆ పాటను అసభ్యకరమైనదిగా ముద్ర వేయడం తనను షాక్‌కు గురిచేసిందని 78 ఏళ్ల సుభాష్ ఘాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దానిని తాము ఫోక్ సాంగ్‌లా చాలా ఆర్టిస్టిక్‌గా చూపించాలని అనుకున్నామని, అలాగే చూపించామని చెప్పుకొచ్చారు. అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం పాట చుట్టూ వివాదాలు కమ్ముకున్నాయని పేర్కొన్నారు. అయితే, ఓ న్యూస్ పేపర్ మాత్రం ఈ పాటను క్లాసిక్ అని అభివర్ణించడం మాత్రం తనకు ఇంకా గుర్తుందని చెప్పారు. తనకు ఉపశమనం ఇచ్చింది అదేనని వివరించారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ఆ పాటను ఫోక్ సాంగ్ అని జనం అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ సినిమాలో యాంటీ హీరో బల్లు పాత్రలో సంజయ్ దత్, పోలీస్ ఆఫీసర్ రామ్‌గా జాకీ ష్రాఫ్, అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గంగగా మాధురీ దీక్షిత్ నటించారు. ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ‘టాడా’, ఆయుధాల చట్టం కింద సంజయ్ దత్ అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది.