చిరంజీవి సేవలపై నీచంగా మాట్లాడినవాళ్లను 12 ఏళ్లు పోరాడి జైలుకి పంపించాను: అల్లు అరవింద్
- నిన్నరాత్రి జరిగిన 'భోళాశంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగామన్న యువ దర్శకులు
- ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగానన్న అల్లు అరవింద్
- మెగాస్టార్ సేవలపై నీచంగా మాట్లాడినవాళ్లని వదల్లేదని వ్యాఖ్య
చిరంజీవి కథానాయకుడిగా రామబ్రహ్మం సుంకర 'భోళాశంకర్' సినిమాను నిర్మించారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిన్న రాత్రి హైదరాబాద్ - శిల్పకళావేదికలో నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "చిరంజీవి గారు చూడని సక్సెస్ ఉందా? ఈ రోజున ఆయన సక్సెస్ కావాలంటూ నేను కొత్తగా విషెస్ చెప్పవలసిన పనిలేదు. మీరంతా చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగితే, నేను ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగాను" అని అన్నారు.
"చిరంజీవిగారు అంటే నాకు ఎంత అభిమానమనేది ఈ రోజున నేను స్టేజ్ పై చెప్పుకోవలసిన పనిలేదు. 12 సంవత్సరాల క్రితం చిరంజీవిగారు చేసే సేవలను గురించి ఒకళ్లు నీచంగా మాట్లాడారు. ఆ విషయంపై 12 సంవత్సరాలు పోరాడి వాళ్లు జైలుకి వెళ్లే వరకూ ఊర్కోలేదు. ఇక ఈ సినిమా దర్శక నిర్మాతలు నాకు బాగా తెలుసు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.