గద్దర్ వస్తే సభలు పోటెత్తాల్సిందే.. 40 ఏళ్ల క్రితమే ఆయన సభకు 15 లక్షల మంది హాజరు
- 1990లో జరిగిన జగిత్యాల సభకు 15 లక్షల మంది హాజరు
- గద్దర్ ఆట, పాట కోసం కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణం
- అలాంటి సభను మళ్లీ చూడలేదంటున్న గద్దర్ సన్నిహితులు
తెలంగాణ చరిత్రలో గద్దర్ ది ఒక ప్రత్యేకమైన స్థానం. ఘనమైన తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు అందులో ఆయన స్థానం సుస్థిరంగా ఉండిపోతుంది. తన పాటలతో కోట్లాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప నాయకుడు గద్దర్. ఆయన వస్తున్నారంటే చాలు... సభా ప్రాంగణాలు జనాలతో కిక్కిరిసిపోయేవి. 1978 సెప్టెంబర్ 9న జగిత్యాలలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ కావచ్చు, 1990 మే 5, 6 తేదీల్లో వరంగల్ లో జరిగిన రైతుకూలీ మహాసభలు కావచ్చు... ఆయనకు ఉన్న జనాకర్షణకు సజీవ సాక్ష్యాలు.
జగిత్యాల సభకు అప్పట్లోనే ఏకంగా 15 లక్షల మంది హాజరయ్యారు. గద్దర్ ఆట, పాటను చూసేందుకే అంతమంది వచ్చారని పలువురి అభిప్రాయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు అలాంటి సభను మళ్లీ చూడలేదని గద్దర్ సన్నిహితులు చెపుతుంటారు. రైతుకూలీ మహాసభల్లో గద్దర్ పాడిన 'జై బోలేరే... జై బోలేరే... అన్నలందరికీ జై బోలో' అనే పాట ఎంతో జనాదరణ పొందింది.