ఎన్సీపీలో మళ్లీ కలకలం.. అమిత్ షాతో జయంత్ పాటిల్ రహస్య సమావేశం?

  • ఆ వార్తల్లో  నిజం లేదన్న పాటిల్
  • ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్
  • ఎన్సీపీని చీల్చాలన్న ఒత్తిడి తనపై లేదని వ్యాఖ్య
శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో మరోమారు కలకలం రేగింది. ఆ పార్టీ మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రహస్యంగా సమావేశమయ్యారని, త్వరలోనే ఆయన కూడా అజిత్ వర్గంలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు కాస్తా వైరల్‌గా మారడంతో పాటిల్ స్పందించారు. ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదని, తాను శరద్ పవార్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు.

శనివారం సాయంత్రం తాను శరద్ పవార్‌ను కలిశానని, ఆదివారం ఉదయం కూడా మళ్లీ ఆయనతో భేటీ అయ్యానని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారు తాను ఏ సమయంలో అమిత్ షాను కలిశానో ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. పార్టీని చీల్చాలన్న ఒత్తిడి తనపై లేదని పాటిల్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా పాటిల్-షా భేటీ వార్తలను ఖండించారు.


More Telugu News