తెలంగాణ ఆశయాలు నెరవేరకుండానే వెళ్లిపోయారు: కిషన్ రెడ్డి ఆవేదన
- గద్దర్ కు నివాళి అర్పించిన కిషన్ రెడ్డి
- గద్దర్ మృతి ఎంతో బాధిస్తోందని ఆవేదన
- తెలంగాణ వచ్చినా ఇబ్బందులు అలానే ఉన్నాయని గద్దర్ భావించేవారు
ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో ఉంచారు. పెద్ద సంఖ్యలో నేతలు, ప్రముఖులు, ప్రజలు తరలివచ్చి, ఆయనను తుదిసారి చూసుకుని కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలో గద్దర్ కు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... గద్దర్ మృతి ఎంతో బాధిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆశయాలు నెరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇబ్బందులు అలానే ఉన్నాయని గద్దర్ భావించేవారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా తనతో చెప్పారని అన్నారు. తాను ఊహించినటువంటి తెలంగాణ రాలేదని ఆయన బాధ పడేవారని చెప్పారు. మరోవైపు గద్దర్ అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.