‘ఇండియా’ చైర్ పర్సన్‌గా సోనియా.. కన్వీనర్‌గా నితీశ్‌కుమార్!
- బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన ‘ఇండియా’
- సోనియా నిరాకరిస్తే ఆమె నామినేట్ చేసిన వ్యక్తి చైర్ పర్సన్ అవ్వచ్చు
- ఈ నెల 31న ప్రకటించే అవకాశం
బీజేపీకి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ, కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలో ఈ నెల 31, వచ్చే నెల 1న జరగనున్న సమావేశంలో వీరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
సమన్వయ కమిటీకి సోనియాగాంధీ నాయకత్వం వహించాలని కాంగ్రెస్ నేతలు సోనియాను కోరినట్టు సమాచారం. ఒకవేళ సోనియా అందుకు నిరాకరిస్తే ఆమె నామినేట్ చేసిన వ్యక్తి సమన్వయ కమిటీకి నాయకత్వం వహిస్తారని చెబుతున్నారు. కన్వీనర్‌గా నితీశ్ వైపే మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తోంది.