వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకే రోజు 380 కి.మీ ప్రయాణించిన చంద్రబాబు

  • నెలూరు నుంచి ఏలూరు వరకూ సుదీర్ఘ ప్రయాణం
  • ప్రాజెక్టులపై రైతులతో భేటీ 
  • గొంతునొప్పితో స్వరం బొంగురు పోయినా ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు
  • ‘పుంగనూరు’ ఘటనలో ప్రభుత్వ తీరును ఖండించిన బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక్క రోజులో ఏకంగా 380 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించారు. ఆదివారం ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ కార్యక్రమంలో భాగంగా ఉదయం నెల్లూరులో బయలుదేరిన ఆయన రాత్రి పొద్దుపోయాక ఏలూరుకు చేరుకున్నారు. నెల్లూరులో టీడీపీ అధినేత ప్రాజెక్టులపై చర్చావేదిక నిర్వహించారు. అనంతరం, ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద రైతులు, సాగు నిపుణులతో వరుసగా సమావేశమై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొన్నారు. రాత్రి ఏలూరులో బస చేశారు. 

చంద్రబాబు ఒకే రోజులో ఇంత దూరం ప్రయాణించి, ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గొంతునొప్పితో స్వరం కాస్త బొంగురు పోయినా చంద్రబాబు తన కార్యక్రమాలకు విరామం ఇవ్వట్లేదని చెప్పాయి. కాగా, పుంగనూరులో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులను చంద్రబాబు ఖండించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 




More Telugu News