అన్నవరం వెళదామని అనుకుంటున్నారా? మీకో అలర్ట్!
- ఒకసారి వసతి గది బుక్ చేసుకున్నాక 90 రోజుల తరువాతే మళ్లీ బుకింగ్‌కు అనుమతి
- ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు
- దళారీ వ్యవస్థను అరికట్టేందుకే ఈ చర్య అని దేవాలయ అధికారుల వివరణ
అన్నవరం వెళదామనుకుంటున్నారా? అయితే, వినండి.. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు దేవాలయ అధికారులు కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఇకపై దేవస్థానంలో ఓసారి వసతి గది బుక్ చేసుకున్నాక మళ్లీ 90 రోజుల తరువాతే మరో బుకింగ్‌కు అనుమతినిస్తూ కొత్త నిబంధన రూపొందించారు.
ఇందుకోసం భక్తుల ఆధార్ కార్డు వివరాల ఆధారంగా గదుల కేటాయింపు కోసం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు భక్తుల వేలిముద్రలు తీసుకోనున్నారు. వసతి సముదాయాల్లో ఏయే గదులు ఖాళీగా ఉన్నాయో చెప్పే బోర్డులను కొండ కింద సీఆర్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు.