మరోసారి కక్ష్య కుదింపు.. జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-3
- ఆదివారం రాత్రి కక్ష్య కుదింపు చర్యను చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు
- మరింత చిన్న కక్ష్యలోకి ప్రవేశిస్తూ చంద్రుడికి చేరువైన వ్యోమనౌక
- మరో రెండు కక్ష్య కుదింపు చర్యలు ఉంటాయన్న ఇస్రో
- ఈ నెల 23న చంద్రుడిపై దిగనున్న ల్యాండర్
చంద్రయాన్-3 తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌకలోని ఇంజిన్ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 మధ్య చంద్రయాన్-3 జాబిల్లికి మరింతగా దగ్గరయ్యేలా మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఆ తరువాత రెండు సార్లు కక్ష్య మార్పు కార్యక్రమం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చివర్లో చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3ని చేర్చుతారు. అనంతరం ఈ నెల 23న చంద్రుడిపై దించుతారు. చంద్రయాన్-3 వ్యోమనౌకను గత నెల శ్రీహరికోట నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. తొలుత భూమి చుట్టూ పరిభ్రమిస్తూ వేగం పుంజుకున్న వ్యోమనౌక శనివారం జాబిల్లి కక్ష్యలోకి తొలిసారిగా ప్రవేశించింది.